Thursday 6 October 2011

మాధవపెద్ది వారి కులదేవత కథ

                                               
ముందుగా బ్లాగర్లకు, పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలు.

గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో  ఉన్న బ్రాహ్మణ కోడూరు మాధవపెద్ది వారి స్వస్థలం. మాధవపెద్ది వారి కులదేవత నాగారుపమ్మ ( నగరపు అమ్మ ). మా వంశకర్తలు నాగేశ్వర శాస్త్రి, అన్నపూర్ణ దంపతులు. సంతానం కలుగకపోవడం వల్ల  ఆ దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి ఒక పిల్లనో పిల్లవాడినో ఇమ్మని ప్రార్థించారు. ఒకరోజు అమ్మ అన్నపూర్ణమ్మగారి కలలో కనబడి  ' నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను ' అన్నది. త్వరలోనె ఆమె ఒక పాముని ప్రసవించింది. ' నాగూ ' అనగానే వచ్చి పాలు తాగేది. ఇంట్లో అందరితోనూ కలిసిపోయేది. కొంత కాలం తరువాత దాలిగుంటలో చుట్టుకొని పడుకొని ఉండగా ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా దానిమీద మీద నీళ్ళు కాచడంతో నాగబాల దగ్ధమైపోయింది. రోజంతా కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. అంతలో ఆ రాత్రి నాగబాల కలలో కనిపించి తను వచ్చిన పని నెరవేరిందని, తనను ఖననం చేసిన చోట గుడి కట్టించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా అదే ప్రదేశంలో ఒక గుడి నిర్మించారు.

ప్రతి కార్తీక పౌర్ణమి నాడు గుళ్ళో అమ్మవారికి ఉత్సవాలు, తెప్పోత్సవం జరుగుతాయి. ఈ ఉత్సవాలలో మాధవపెద్ది కుటుంబీకులే తొలిపూజ చేయడం ఆనవాయితి. ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా గుడికి వెళ్ళీ కానుకలు సమర్పించడం వంశాచారం. కుటుంబంలోని తొలిసంతానానికి ' నాగ ' పేరు పెట్టడం ఆచారంగా మారింది. అలా పెట్టకపోయిన సందర్భాలలో ఆ సంతానం ఏదోక కారణం వల్ల అకాల మరణం చెందడం జరుగుతోంది. అలా మరణించిననవారికి ఉదాహరణ మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ చంద్ర ( సినీ నేపథ్య గాయకుడు ). 1993లో ఆగస్టు 9న 46వ యేట అకారణంగానే మరణించాడు. అలాగే మా చిన్నాన్న గోఖలేగారి అమ్మాయి సరోజ 51వ సంవత్సరంలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి.

మా నాన్నగారు  నాగేశ్వరరావు గారు కమ్యూనిస్టు. ఆధునిక భావాలు కలిగి ఉండేవారు. అందువల్ల మా అన్నయ్యకీ, నాకూ బారసాల చెయ్యలేదు. అన్నయ్యని రమేష్ అని పిలిచేవారు. అ  రమేష్ నన్ను సురేష్ అని పిలవడంతో నా పేరు సురేష్ అయిపోయింది. స్కూలు రికార్డుల్లో మా పేర్లు రమేష్ చంద్ర, సురేష్ చంద్ర అయిపోయాయి.

12 comments:

 1. మీ టపాల వలన ఇంతకు ముందు నాకు తెలియని మాధవపెద్ది వారి మధ్య బాంధవ్యాలను తెలుసుకోగలిగాను.
  బృందావనం సినిమా హీరో రాజేంద్రప్రసాద్ గారైనప్పటికీ ఆ సినిమా చూసిన(విన్న) తరువాత, మీరే "బృందావనం" హీరో అనిపించింది.
  ధన్యవాదాలు. "మధురమే సురేష్ గీతం"

  ReplyDelete
 2. అన్నపూర్ణమ్మగారు ఒక పాముని ప్రసవించారా? ఇవన్ని మీరు నమ్మటమే కాకుండా జనాల్నికూడా నమ్మమంటున్నారా? ఏ బడిలో చదువుకున్నారు సారూ?

  స్టీవ్ జాబ్స్ 56 ఏళ్లకే మరణించాడు, పాపం ఆయన తల్లి తండ్రులకి కూడా ఇలాంటి శాపమే ఉండి ఉంటుంది.

  ReplyDelete
 3. @EDGE :
  కనీసం సొంత పేరు చెప్పుకోని ఒక వ్యాఖ్య రాయండి ముందు ఎద్గె ( తెలుగు లొ అలానే వస్తొంది ) ... తర్వాత మీరు చెప్పిన విషయాల గురించి చూడచ్చు.. కొంపతీసి మార్తాండ గారి మరో రూపమా మీరు ?

  ReplyDelete
 4. Don't worry sir , You can write what ever you want. Its your blog .

  MR.EDGE : at least give respect to his knowledge which you cant even achieve.

  First of all like in the above comment ... show your real name and write something ...

  ReplyDelete
 5. Don't worry sir , You can write what ever you want. Its your blog .

  MR.EDGE : at least give respect to his knowledge which you cant even achieve.

  First of all like in the above comment ... show your real name and write something ...

  ReplyDelete
 6. This nEDGE is a looser. If he does not beleive what the blogger said, he has right to do that, but he should write in a proper language.There are many interesting items narrated in the post. Why has he found only this point in the blog?

  ReplyDelete
 7. Suresh sir,
  Please add Naga to your name so that we can continue listening to your music for a long time

  ReplyDelete
 8. సురేష్ గారి సంగీత విద్వత్తును ప్రశ్నించటం గాని, వారి కుటుంబాన్ని, పూర్వీకులను అవహేళన చేయటంగాని నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలు అందుకు ఆస్కారం కల్పించినందుకు క్షంతవ్యుడను.

  సురేష్ గారు వారి వంశంలో గతంలో జరిగినట్లుగా చెప్పిన సంఘటనల లోని అసహజతను, నిర్హేతుకతను, అశాస్త్రీయతను ప్రశ్నించటమే నా ఉద్దేశం. కనీస ప్రాధమిక విచారణకు నిలువని నమ్మకం విశ్వాసం నిరర్ధకమని నా అభిప్రాయం.

  ReplyDelete
 9. దైవం విషయంలో కలిగే కొన్ని అనుభవాలు ఇతరులకు శాస్త్రీయంగా నిరూపించటం అన్నివేళలా సాధ్యం కాదట. ఎవరికి వారికి అనుభవంలోకి వస్తేనే అర్ధమవుతాయంటారు...

  ReplyDelete
 10. సురేష్ గారు,నమస్తే!మీరు బ్లాగ్ ప్రపంచం లోకి రావడం చాలా ఆనందంగా వుంది.తరచు మీ అనుభవాలు రాస్తూండండి.సౌమ్య గారి బ్లాగ్ ద్వారా మీరూ బ్లాగ్ రాస్తున్నారని తెలిసింది.ముఖ్యంగా మీ కులదేవత గురించి రాసింది నేను ఇదివరకే వేరేవారి విషయంలో విన్నాను.వాళ్ళింట్లో కూడా అందరి పేర్లకు ముందు నాగ అని వుంటుంది.కాకతాళీయమో,ఏమో మరి.

  ReplyDelete
 11. సురేష్ గారు,నమస్తే!మీరు బ్లాగ్ ప్రపంచం లోకి రావడం చాలా ఆనందంగా వుంది.తరచు మీ అనుభవాలు రాస్తూండండి.
  కళాసాగర్

  ReplyDelete