Thursday 15 September 2011

మన సినిమాకి ఎనభయ్యేళ్ళు

                                                     

                     ఈ రోజు తెలుగు సినీ కళామతల్లి ఎనభయ్యో పుట్టిన రోజు. పరిశ్రమలోని అందరికీ పండుగ రోజు. ఈ సందర్భంగా మా కుటుంబంలోని నాలుగు తరాల  కళాకారులు సినీరంగంలో ఉన్నారని చెప్పగలుగుతున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను.
                     నాకు  వరుసకి తాతగార్లైన మాధవపెద్ది వెంకట్రామయ్యగారు, వి. శివరాం గారు టాకీ ప్రారంభమైన తొలినాళ్ళలో కొన్ని తెలుగు చిత్రాలలో నటించారు. వి. శివరాం గారు ప్రముఖ సౌండ్ ఇంజినీర్.
                      మా చిన్నాన్న గోఖలే గరూ కళాదర్శకుడిగా, ఇంకో చిన్నాన్న సత్యం గారు తెలుగు చిత్రసీమకి విలువైన సేవలందించారు. వరుసకి బాబాయైన మాధవపెద్ది రామగోపాల్ గారు కేఎస్ ప్రకాశరావు గారి ' దీక్ష ' లో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఇదే చిత్రంలో ఆచార్య ఆత్రేయ గారి మొట్టమొదటి పాట ఆయన మీదే చిత్రీకరించబడింది. రామగోపాల్ గారు నర్తనశాల చిత్రానికి, మరికొన్ని చిత్రాలకి సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు.
                     మా అన్నయ్య రమేష్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు పాడారు. ఆయన ప్రొత్సాహంతోనే వెయ్యి సినిమాలకి పైగా కీబోర్డ్ ప్లేయరుగా, యాభైకి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా నేనూ పరిశ్రమకి నాకు తోచిన సేవలందించాను.
                     నాలుగో తరంలో మా అల్లుడికి స్వయానా అన్నగారి కుమారుడు చి.సుశీంద్రన్ తమిళ చిత్రరంగంలో ప్రసిధ్ధ దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. మ్మ కోడలికి స్వయానా తమ్ముడు చి. మహత్ రాఘవేంద్ర  తమిళంలో ఇప్పుడిప్పుడే కథానాయకుడిగా మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. భగవంతుడు ఇలా సినీ కళామతల్లికి  సేవ చేసే భాగ్యం కల్పించాడు.       

5 comments:

  1. అదృష్టవంతులండీ! అభినందనలు. తరతరాలుగా ఇలానే కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete
  2. రసఙ్ఞ గారు,
    మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాగుందండి మంచివివరాలందించారు

    ReplyDelete
  4. రాజేంద్రకుమార్ గారు, తొలితరం నటులు నటించిన సినిమాల పేర్లు వీఏకె రంగారావు గారిని అడిగి తెలుపగలను. ధన్యవాదాలు

    ReplyDelete
  5. అవును మా గోఖలే గారు కళాదర్శకుడిగా, కథా రచయితగా ప్రసిద్దులు.
    కళాసాగర్

    ReplyDelete